News

పవన్ కళ్యాణ్‌కు సుజన చౌదరి కౌంటర్


ప్రముఖ సినీ నటుడు ,జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి సుజన చౌదరి స్పందించారు.వ్యాపార వేత్తలు రాజకీయాలలోకి రాకూడదని ఎక్కడా రాజ్యాంగంలో లేదని సుజన కౌంటర్ ఇచ్చారు.వ్యాపారం నీతిగా చేస్తున్నారా?లేదా అన్నది చూడాలని ఆయన అన్నారు.ఆంద్ర ఎమ్.పిలు ఎలా పని చేస్తున్నది ప్రజలు నిర్ణయిస్తారని ఆయన అన్నారు.ఎపి ఎమ్.పిలు వ్యాపార ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని పవన్ కళ్యాణ్ విమర్శలు చేసిన నేపధ్యంలో సుజనా చౌదరి ఈ సమాధానం చెప్పారు.ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.పవన్ కళ్యాణ్ మంచి సూచనలు ఇస్తే స్వీకరిస్తామని ఆయన అన్నారు.